![]() |
![]() |

అల్లు అర్జున్‌తో 'ఆర్ఎక్స్ 100' పాప పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని టాలీవుడ్ టాక్. అయితే, హీరోయిన్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కాదట. ఒక సాంగ్ వరకూ స్టెప్పులు వేసే ఛాన్స్ ఆమెకు దక్కవచ్చని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సిన్మా 'పుష్ప'. ఇందులో ఐటమ్ సాంగ్ కోసం పాయల్ రాజ్‌పుత్‌ను అప్రోచ్ అయినట్టు టాక్.
ఆల్రెడీ 'సీత' సినిమాలో ఈ హాట్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసింది. 'పుష్ప' ఆఫర్‌కి ఓకే అంటే పాయల్‌కి ఇది సెకండ్ ఐటమ్ సాంగ్ అవుతుంది. 'యన్.టి.ఆర్ - కథానాయకుడు'లో జయసుధగా ఒక పాటలో అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే ఆమెకు మంచి ఆఫర్ అనుకోవాలి.
సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటాయ్. దేవిశ్రీ ప్రసాద్ మాంచి మాసీ ట్యూన్స్ ఇస్తాడు. అందులోనూ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అదరగొట్టాయ్. 'ఆ అంటే అమలాపురం', 'రింగ రింగ' సాంగ్స్ ఒక ఊపు ఊపేశాయ్. ప్రజెంట్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. ఇందులో ఐటమ్ సాంగ్ కోసం లాస్ట్ రెండు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌కి ఏమాత్రం తీసిపోని రీతిలో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేశాడట. అదిరిపోయే రేంజ్‌లో షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట.
![]() |
![]() |